శ్రుతి వల్ల మహేష్ బాబు సినిమా ఆలస్యం..!

Unknown | 22:55 | 0 comments

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సినిమాకు ఇప్పుడు శృతి హాసన్ కాల్ షీట్స్ ఎఫెక్ట్ బాగా పడేలా కనిపిస్తోంది. సాధారణంగా మహేష్ లాంటి హీరో కాల్ షీట్ల సమస్య మిగతా వాళ్లమీద ఎఫెక్టు పడుతూంటుంది. అయితే ఇక్కడ శృతిహాసన్ కాల్ షీట్ల సమస్య మహేష్ మీద పడబోతోందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ శృతి హాసన్ డేట్స్ సమస్య వలన లేటయ్యేటట్లు ఉందని తెలుస్తోంది.ఆమె వల్ల ఈ సినిమా నిర్మాణం ఆలస్యం కావచ్చని అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగ్ ఇటీవల పూణేలో జరిగింది. అయితే, అక్కడ ప్లాన్ చేసిన ప్రకారం షూటింగ్ జరగలేదని సమాచా రం. ఇప్పటికే విజయ్ హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రానికి శ్రుతి బల్క్ డేట్స్ ఇచ్చేసిందట. ఆ సినిమా షూటింగ్ ఇటీవలే చెన్నయ్ లో పలువురు ఆర్టిస్టుల కాంబినేషన్లో మొదలైంది. దాంతో మహేష్ సినిమా షూటింగులో కొన్ని రోజులే పాల్గొని, అక్కడి నుంచి చెన్నయ్ చెక్కేసిందట. డిసెంబర్ మొదటి వారం దాకా ఆ తమిళ సినిమా షూటింగులోనే ఈ చిన్నది ఉంటుంది. ఈ కారణంగా మహేష్ సినిమా కాస్త వెనక పడే అవకాశం వుందని అంటున్నారు.

Category:

0 comments