సంక్రాంతి సినిమాలకు థియేటర్ల వార్.. ఎవరు తగ్గుతారో..!
సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్‌లో హీరోల మధ్య థియేటర్ల వార్ జరుగుతోంది. సంక్రాంతికి తెలుగులో పెద్ద హీరోలు నటించిన టెంపర్, గోపాలా.. గోపాలా వస్తున్నాయి. తారక్-పూరి సినిమా జనవరి 9న విడుదల చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. ఇక గోపాలా.. గోపాలా కూడా సంక్రాంతి రోజున విడుదలవుతుందని ఇందులో అనుమానాలు అక్కర్లేదని నిర్మాత సురేష్‌బాబు ప్రకటించారు. ఇక దక్షిణ భారతదేశపు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ నటించిన ఐ చిత్రం కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా 20వేల థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఆడియోను డిసెంబర్ 10న విడుదల చేస్తున్నారు.
టెంపర్, గోపాలా…గోపాలాతో పాటు ఐ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే ఉంటే ఈ మూడు సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టమైపోతుందన్న భావన వ్యక్తమవుతోంది. పైగా ఈ మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే భారీ ఓపెనింగ్స్ రావు. నిర్మాతలు సినిమా హిట్ అయినా నష్టపోవాల్సిన పరిస్థితి. విశాల్ సినిమా అంబాలా కూడా సంక్రాంతికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ ఎంట్రీ చిత్రం ముకుంద కూడా సంక్రాంతి బరి నుంచి తప్పుకుని క్రిస్మస్‌కు ముస్తాబవుతుంది. మరి వీరిలో ఎవరైనా తగ్గుతారా లేదా ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ బరిలో సంక్రాంతికి తలపడతాయా అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
Category: FILM NEWS
0 comments